Birla A1 - top cement brand in india
strongcrete special cement

భూగోళం రక్షణకు
శ్రేష్టమైనది

బిర్లా A1 ఓరియంట్‌గ్రీన్ సిమెంట్ అనేది ఇప్పుడొక తప్పనిసరి అవసరం. కనీస స్థాయిలో ఇంధనం మరియు సహజ వనరులు ఉపయోగించి ఇది తయారుచేయబడింది. కాబట్టి, ఇది పర్యావరణ అనుకూలంగా ఉండడంతో పాటు ఈ భూగోళాన్ని రక్షించడంలో ఒక ముఖ్యమైన పాత్ర వహిస్తోంది.

కోసం పర్యావరణ హితమైన భవిష్యత్తు
నిర్మించండి కోసం మీ ఇంటిని ఓరియంట్గ్రీన్తో

ఓరియంట్గ్రీన్ సిమెంట్కు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) - గ్రీన్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ కౌన్సిల్ ‘గ్రీన్ఫ్రో’ సర్టిఫికేషన్ లభించింది. అంటే, ఓరియంట్గ్రీన్ అనేది పర్యావరణం మీద తక్కువ ప్రభావం కలిగి ఉంటుంది మరియు గ్రీన్ బిల్డింగ్లు మరియు గ్రీన్ కంపెనీల పనితీరును మెరుగుపరచడంలో గణనీయంగా దోహదపడుతుంది. ఫలితంగా, సహజ వనరుల సంరక్షణలో సహాయపడుతుంది మరియు ఇండోర్ మరియు అవుట్డోర్ రెండింటిలోనూ జీవన అనుకూల మెరుగైన వాతావరణం అందిస్తుంది.

అలాగే, ఇది కేవలం పర్యావరణ అనుకూలమైనది మాత్రమే కాదు. ఇది దీర్ఘకాలిక దృఢత్వం అందిస్తుంది మరియు నిర్మాణాల్లో లీకేజీ లేదా సీపేజీ లేకుండా చేస్తుంది.

Advantages of OrientGreen in fresh concrete

ప్రయోజనాలు ఓరియంట్గ్రీన్
తాజా కాంక్రీట్లో

పనిచేసే సౌలభ్యం

ఓరియంట్గ్రీన్ సిమెంట్లో గోళాకార సిమెంట్ కణాలు ఉంటాయి మరియు ఇవి అధిక సూక్ష్మతా విలువ కలిగి ఉంటుంది. గోళాకారంలో ఉండడం వల్ల, కాంక్రీటు మరింత స్వేచ్ఛగా కదులుతుంది మరియు ఈ కణాల అధిక సున్నితత్వం అనేది రంధ్రాలను మెరుగ్గా నింపడంలో సహాయపడుతుంది. తద్వారా, మెరుగైన సమన్వయం అందిస్తుంది. OPCతో తయారు చేయబడిన కాంక్రీటుతో పోలిస్తే, ఓరియంట్గ్రీన్ సిమెంట్ అనేది ప్రత్యేకించి, వేడి వాతావరణ పరిస్థితుల్లో కాంక్రీటు క్షీణత నష్టాన్ని తగ్గిస్తుంది.

సెట్టింగ్ సమయం మరియు స్మూత్నెస్

ఓరియంట్గ్రీన్ సిమెంట్ అనేది కాంక్రీట్ సెట్టింగ్ సమయాన్ని పొడిగిస్తుంది. తద్వారా, కాంక్రీటు లేదా సిమెంట్ మోర్టార్ మరింత స్మూత్గా మారడంలో సహాయపడుతుంది. కాంక్రీట్ మిశ్రమం సంయోగత అనేది కాంక్రీటు స్మూత్నెస్కు సహాయపడుతుంది.

బ్లీడింగ్

బ్లీడింగ్ అనేది ఒక విధమైన విభజన. ఇందులో భాగంగా, కాంక్రీట్ మిశ్రమంలోని కొంత నీరు తాజా కాంక్రీటు ఉపరితలంపైకి చేరుతుంది. బ్లీడింగ్ కారణంగా, పై ఉపరితలం ఎక్కువ తడిగా మారుతుంది. దీంతో, కాంక్రీట్ ఎక్కువ రంధ్రయుతంగా మారడం వల్ల, బలహీనంగా మరియు తక్కువ దృఢత్వంతో ఉంటుంది. ఓరియంట్గ్రీన్ సిమెంట్ అనేది పని సామర్థ్యం కోసం ఎక్కువ పరిమాణంలో మరియు తక్కువ నీరు కలిగి ఉండడం వల్ల, బ్లీడింగ్ తగ్గుతుంది. ఇది బ్లీడ్ వాటర్ ఛానెళ్లను నిరోధించడంలో కూడా సహాయపడుతుంది.

ప్రయోజనాలు ఓరియంట్గ్రీన్
దృఢపడిన కాంక్రీట్లో

కంప్రెసివ్ దృఢత్వం మరియు దృఢత్వం పెరుగుదల

ఓరియంట్గ్రీన్తో తయారైన కాంక్రీటు దృఢత్వం మరియు దృఢత్వం పొందే రేటు అనేది సాధారణ కాంక్రీటుతో సమానంగా 28 రోజులు ఉంటుంది. ఆర్ద్రీకరణ రేటు నెమ్మదించిన తర్వాత కూడా ఓరియంట్గ్రీన్ సిలికేట్ నిర్మాణం కొనసాగుతుంది. ఫలితంగా, తర్వాత కాలంలోనూ దృఢత్వం పెరుగుతుంది. ఈ అధిక రేటు దఢత్వం పెరుగుదల అనేది కాలంతో పాటు కొనసాగడం వల్ల, భవిష్యత్తులోనూ నిర్మాణం దృఢంగా ఉంటుంది.

స్టీల్తో కాంక్రీట్ బంధం

స్టీల్తో కాంక్రీటు యొక్క సంశ్లేషణ బంధం అనేది కాంక్రీటుతో స్టీల్ యొక్క సంపర్క అంచులు, దాని యొక్క లోతు మరియు కాంక్రీటు సాంద్రతపై ఆధారపడి ఉంటుంది. ఓరియంట్గ్రీన్ స్వతహాగా సూక్ష్మంగా ఉండడం వల్ల సాధారణంగా పేస్ట్ వ్యాల్యూమ్ను పెంచుతుంది మరియు బ్లీడింగ్ తగ్గిస్తుంది. అందువలన, సంపర్క అంచు పెరుగుతుంది. ఫలితంగా స్టీల్తో బంధం మెరుగుపడుతుంది.

హీట్ ఆఫ్ హైడ్రేషన్

ఓరియంట్గ్రీన్ ఆర్ద్రీకరణ అనేది సాధారణ సిమెంట్ ఆర్ద్రీకరణ కంటే నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి, వేడి ఉత్పత్తి నెమ్మదిగా ఉండడంతో పాటు కాంక్రీటులో అంతర్గత ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి, డ్యామ్లు, రీటైనింగ్ గోడలు, భారీ పునాదుల వంటి భారీ కాంక్రీట్ల కోసం ఓరియంట్గ్రీన్ ఒక అనువైన సిమెంట్గా ఉంటుంది.,

ష్రింకేజ్ తగ్గిస్తుంది

కాంక్రీటులోని ఓరియంట్గ్రీన్ అనేది డ్రైయింగ్ ష్రింకేజ్ మరియు ప్లాస్టిక్ ష్రింకేజ్ తగ్గించడంలో సహాయపడుతుంది. అంతర్గత కాంక్రీటు ఒత్తిడి తక్కువగా ఉండడంతో పాటు నెమ్మదైన ఉష్ణ ఉత్పత్తి కారణంగా, డ్రైయింగ్ ష్రింకేజ్ తగ్గుతుంది. నిర్ధిష్ట స్లంప్లో కాంక్రీట్ బ్లీడింగ్ తక్కువగా ఉండడం వల్ల, ప్లాస్టిక్ ష్రింకేజ్ కూడా గణనీయంగా తగ్గుతుంది. తద్వారా, కాంక్రీట్ అనేది క్రాక్-రెసిస్టెంట్గా ఉంటుంది.

దృఢత్వం

కాంక్రీటులోని అంతర్గత ఖాళీ ప్రదేశాలు పరస్పరం అనుసంధానించబడితే, కాంక్రీట్ అనేది పారగమ్యంగా మారుతుంది. ఓరియంట్గ్రీన్ కాంక్రీటులో, ప్రారంభ ఆర్ద్రీకరణ సమయంలో విడుదల అయ్యే సున్నం Ca (OH)2 అనేది రియాక్టివ్ సిలికా ద్వారా వినియోగించబడుతుంది మరియు కాంక్రీటు ఉపరితలం మీద లీచింగ్ కావడానికి బదులుగా, కరిగిపోని ఒక సిమెంట్ సమ్మేళనం ఏర్పరుస్తుంది. తద్వారా, కాంక్రీట్లో ఖాళీ ప్రదేశాలను తగ్గించడంలో మరియు కేశనాళికా మార్గాలను నిరోధించడంలో ఇది సహాయపడుతుంది మరియు కాంక్రీట్ పారగమ్యతను తగ్గించడంలోనూ సహాయపడడం ద్వారా, కాంక్రీటు మన్నికను పెంచుతుంది.

తక్కువ నిర్వహణ ఖర్చు

ఓరియంట్గ్రీన్ అనేది రసాయన దాడి మరియు స్టీల్ తుప్పు పట్టడం నుండి అధిక నిరోధకత అందిస్తుంది. కాంక్రీట్ ష్రింకేజ్ మరియు ఉష్ణం కారణంగా పగుళ్లు ఏర్పడే అవకాశాలను కూడా ఇది తగ్గిస్తుంది. తద్వారా, నిర్మాణం జీవితకాలం పెంచుతుంది మరియు నిర్వహణ వ్యయం తగ్గిస్తుంది.

Advantages of OrientGreen in hardened concrete

ఓరియంట్ గ్రీన్ ఉపయోగాలు

  • హైడ్రాలిక్ నిర్మాణాలు, నీటిలో నిర్మాణాలు, సముద్రతీర నిర్మాణాలు, డ్యామ్ నిర్మాణం మొదలైన వాటికి ప్రభావవంతమైనది.,
  • ప్రీ-స్ట్రెస్డ్ మరియు పోస్ట్-టెన్షన్డ్ కాంక్రీట్ మెంబర్లకు తగినది
  • నిర్మాణ మోర్టార్లు మరియు ప్లాస్టరింగ్ కోసం ఉపయోగిస్తారు
  • ఇది అద్వితీయమైన ఉపరితల ఫినిష్ అందిస్తుంది కాబట్టి, అలంకార మరియు ఆర్ట్ నిర్మాణాల కోసం ఉపయోగిస్తారు
  • ప్రీక్యాస్ట్ మురుగునీటి పైపుల తయారీకి ఉపయోగిస్తారు

విలువ-ఆధారిత సేవలు

* ఎంపిక చేసిన ప్రదేశాల్లో

‘కాంక్రీట్ ఎక్స్పర్ట్’ అనేది మా కస్టమర్ల కోసం అందించే ప్రత్యేక సర్వీస్. అత్యంత అనుభవజ్ఞులతో కూడిన మా టెక్నో-మార్కెటింగ్ బృందం మీ ఇంటి వద్దనే ఓరియంట్గ్రీన్ సిమెంట్ అత్యుత్తమ నాణ్యతను ప్రదర్శిస్తుంది, మార్గదర్శకత్వం అందిస్తుంది మరియు మీకు భరోసా ఇస్తుంది. మా మొబైల్ కాంక్రీట్ ఎక్స్పర్ట్ వ్యాన్లోని అధునాతన ఉపకరణాలనేవి మీరు ఉపయోగించిన సిమెంట్ నాణ్యతను అనేక మార్గాల్లో పరీక్షించడానికి మరియు మా నిపుణుల ద్వారా ఆన్సైట్ సాంకేతిక సేవలు అందించడానికి వీలు కల్పిస్తాయి.

Value added services
Step 1
Step 2
Step 3
కస్టమర్ కేర్ నంబర్
Call Icon
మహారాష్ట్ర / మధ్య ప్రదేశ్
ఛత్తీస్‌గఢ్ / గుజరాత్
+91 98500 84073
Call Icon
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
+91 98485 33301
Call Icon
కర్ణాటక / తమిళనాడు
గోవా / కేరళ
+91 70266 38654

బ్రోచర్‌ను డౌన్‌లోడ్ చేయడానికి దిగువ ఫారమ్‌ను పూరించండి

* తప్పనిసరి ఫీల్డ్