గృహ నిర్మాణంలో బరువును తట్టుకునే కాంక్రీట్ కట్టడాలు చాలా ముఖ్యమైనవి. అందువల్ల ఒత్తిడిని తట్టుకుని, వాతావరణంలో సంభవించే మార్పులను గట్టిగా ఎదుర్కొనే ప్రత్యేకమైన సిమెంట్ ను ఉపయోగించడం చాలా అవసరం.
మీరు మీ ‘స్వప్న గృహాన్ని’ నిర్మిస్తున్నప్పుడు, ఉత్తమ నాణ్యత గల ముడి సరుకుని ఉపయోగిస్తున్నారని ఖచ్చితంగా అనుకుంటారు అలాగే అదే సమయంలో మీ ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి అవ్వాలని ఆశతో ఉంటారు.
మా వినియోగాదారులయిన మీకు ఉత్తమ ఉత్పత్తులని అందిచడానికి మా ప్రయత్నంలో, బిర్లా A1 స్ట్రాంగ్క్రీట్ పరిచయం చేయడానికి మేము గర్వంగా భావిస్తున్నాం. బిర్లా A1 స్ట్రాంగ్ క్రీట్, తక్కువ సమయంలో దృఢమైన కాంక్రీట్ నిర్మాణాలని నిర్మించుకోవడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది. దీని అర్థం మీ స్వప్న గృహం త్వరగా సిద్ధం అవుతుంది మరియు ఎప్పటికీ నిలిచి ఉంటుంది.
పునాది, బీమ్స్ , స్తంభాలు, మరియు పైకప్పు వంటి మీ కలల ఇంటి యొక్క బరువును-ఆపగలిగే కాంక్రీట్ నిర్మాణాలు అత్యంత ముఖ్యమైన విషయాలు అందువల్లే వారికి అత్యధిక ఒత్తిడికి నిలిచి మరియు కఠినమైన వాతావరణ పరిస్థితులకి తట్టుకునే ప్రత్యేకమైన సిమెంట్ అవసరం.
బిర్లా A1 స్ట్రాంగ్క్రీట్ ను కాంక్రీట్ పనులకు అత్యంత అనుకూలంగా రూపొందించేందుకు మేము సిమెంట్ కు సంబంధించిన లక్షణాలను వాంచనీయ పాళ్ళలో సమకూర్చడం జరిగింది, అత్యంత సన్నని రేణువుల పంపిణీ, లవణాల మిశ్రమం ఇందులో ప్రముఖంగా ఉన్నాయి. ఇలా వాంచనీయ పాళ్ళలో రూపొందడం వల్ల దీనితో నిర్మితమైన కట్టడాలు దృఢత్వాన్ని కలిగి ఎక్కువ కాలం చెక్కు చెదరకుండా ఉంటాయి.
బిర్లా A1 స్ట్రాంగ్క్రీట్ వాంచనీయ సున్నితత్వం వల్ల- కాంక్రీటును కలపడం, రవాణా చేయడం, కట్టుబడిలో ఉంచడం, సంఘటితం చేయడం లాంటి అంశాల్లో కాంక్రీటు పనులకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఇందువల్ల కాంక్రీటులో సాంద్రత, దృఢత్వం, సంఘటితత్వాలు ఖచ్చితంగా ఉంటుంది. చిక్కటి సాంద్రతలో రూపొందిన కాంక్రీటు వల్ల స్టీలు బార్స్ లేదా రీ-ఇంఫోర్స్మెంట్ తో పటిష్ఠమైన బంధం ఏర్పడుతుంది.
బిర్లా A1 స్ట్రాంగ్క్రీట్ తయారీలో ఓరియంట్ సిమెంట్ వారి అధీకృత టెక్నాలజీ అయిన సుప్రసిద్ధ ‘ప్రెషర్ సస్టైనింగ్ టెక్నాలజీ’ (PST®) ని ఉపయోగించడం జరిగింది. దీనివల్ల అత్యధిక ఒత్తిడిని తట్టుకునే లక్షణం బిర్లా A1 స్ట్రాంగ్క్రీట్ లో ఉంది. సిమెంట్ తాలూకు రేణువుల పరిమాణం ఒకేలా ఉండేందుకు వీలుగా మా అత్యుత్తమ ప్లాంట్స్ లో NABL గుర్తింపు పొందిన ల్యాబ్ లో కట్టుదిట్టమైన నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తున్నాము.
వాంచనీయ స్థాయి (సుమారు 18%) ఖనిజ మిశ్రమాలని బిర్లా A1 స్ట్రాంగ్క్రీట్ కలిగి ఉంది. ఇందువల్ల తొలి దశలో అత్యంత దృఢత్వాన్ని సంతరించేందుకు దోహదం చేసే అత్యుత్తమ నాణ్యమైన C3S (ట్రై-కాల్షియం సిలికేట్) పరమాణువులు ఇందులో పుష్కలంగా ఉంటాయి.
దీనితోపాటు అత్యున్నత నాణ్యత కలిగిన ఖనిజ లవణాల మిశ్రమం ద్వారా కాల్షియం – సిలికేట్- హైడ్రేట్ జెల్ (C-S-H) ఫార్మేషన్ రూపొందడాన్ని రెట్టింపు వేగవంతం అవుతుంది. దీనివల్ల దీర్ఘకాల వ్యవధిలో కాంక్రీట్ మరింత దృఢత్వాన్ని సంతరించుకుంటుంది.
Optimum fineness of Birla A1 StrongCrete makes the concrete highly workable in terms of mixing, transportation, and placement & compaction. This guarantees a denser, stronger and more compact concrete. The denser concrete thus formed also has an enhanced bond with the steel bars or reinforcement.
Optimum fineness of Birla A1 StrongCrete makes the concrete highly workable in terms of mixing, transportation, and placement & compaction. This guarantees a denser, stronger and more compact concrete. The denser concrete thus formed also has an enhanced bond with the steel bars or reinforcement.
బిర్లా A1 స్ట్రాంగ్క్రీట్ తో మీ స్వప్న గృహాన్ని నిర్మిస్తే, మీరు బహుళ ప్రయోజనాలు పొందుతారు:
ఉన్నతమైన తొలి దశ దృఢత్వం ఉన్నతమైన తొలి దశ దృఢత్వం కాంక్రీట్ దృఢత్వాన్ని పూనుకోవడం ఒక క్రమపద్ధతిలో సాగే ప్రక్రియ. ఇతర సిమెంట్ తో పోల్చిచూస్తే బిర్లా A1 స్ట్రాంగ్క్రీట్ ఉన్నతమైన దృఢత్వాన్ని త్వరగా అందిస్తుంది. దీనిలోని ఉన్నతమైన తొలి దశ దృఢత్వ లక్షణం వల్ల ఫార్మ్ వర్క్ ను (డి-షట్టరింగ్) త్వరగా తొలగించండి వీలై, నిర్మాణ సమయం చాలా వరకు ఆదా అవుతుంది.
ఉన్నత దృఢత్వం అత్యున్నత అంతిమ దృఢత్వం అత్యున్నత అంతిమ దృఢత్వం బిర్లా A1 స్ట్రాంగ్క్రీట్ తో తయారైన కాంక్రీటు డిజైన్డ ఒత్తిడి శక్తిని క్యాస్టింగ్ పూర్తయిన తొలి 28 రోజుల్లోనే పుంజుకుంటుంది. బిర్లా A1 స్ట్రాంగ్క్రీట్ లోని అత్యంత అధునాతనమైన ఫార్ములా వల్ల ఆ తర్వాత కూడా దృఢత్వాన్ని పుంజుకునే లక్షణం కొనసాగుతూనే ఉంటుంది. అందువల్ల RCC పునాదులు, కాలమ్స్, బీమ్స్, శ్లాబ్స్ వంటి కాంక్రీట్ పనులకు బిర్లా A1 స్ట్రాంగ్క్రీట్ ఎంతో అనుకూలమైనది.
సిమెంట్ మిశ్రమం గట్టిపడేందుకు తీసుకునే సమయాన్ని ‘స్థిరపడే సమయం’ అంటారు. తొలిదశలో స్థిరపడే సమయం (IST) తక్కువగా ఉండకూడదు. అదేవిధంగా అంతిమంగా స్థిరపడే సమయం (FST) ఎక్కువగా ఉండకూడదు. బిర్లా A1 స్ట్రాంగ్క్రీట్ తొలిదశలో స్థిరపడే సమయం 120 నిముషాలు కాగా, అంతిమంగా స్థిరపడే సమయం 175 నిముషాలు. దీనివల్ల మొత్తం నిర్మాణ ప్రక్రియ సులభంగానూ, వేగంగానూ పూర్తవుతుంది. త్వరగా స్థిరపడే సమయం కలిగిన బిర్లా A1 స్ట్రాంగ్క్రీట్ వాడటం వల్ల తర్వాతి క్రమంలో వేయాల్సిన కాంక్రీటు పొరలను త్వరగా వేయడం వీలవుతుంది. అదేవిధంగా స్కేఫోల్డింగ్, లేదా ఫార్మ్ వర్క్ ను త్వరగా తొలగించడం సాధ్యమవుతుంది.
అతి తక్కువ హైడ్రేషన్ వేడి కారణంగా, వాతావరణంలో వేడి వల్ల కూడా ఏర్పడే పగుళ్ళవంటి నష్టాల నుంచి బిర్లా A1 స్ట్రాంగ్క్రీట్ కట్టడాలను కాపాడుతుంది.
బిర్లా A1 స్ట్రాంగ్క్రీట్ ఆర్ర్డీకరణ (హైడ్రేషన్) లో అతితక్కువ వేడిని విడుదల చేస్తుంది. అందువల్ల దళసరి కాంక్రీటు సెక్షన్స్ పై వేడివల్ల ఏర్పడే పగుళ్ళ బెడద ఉండదు.
బిర్లా A1 స్ట్రాంగ్క్రీట్ డబుల్ లో కాల్షియం-సిలికేట్-హైడ్రేట్-జెల్ (C-S-H) ఫార్మేషన్ అవ్వడం వల్ల నిర్మాణంలో ఉపయోగించే రేఇన్ఫోర్డ్స్ స్టీల్ బార్స్ తుప్పు పట్టకుండా కాపాడి, కట్టడాలు ఎక్కువకాలం మన్నికగా ఉండేలా కాపాడుతుంది.
ఈ జెల్ ఫార్మేషన్ కాంక్రీట్ ను చిక్కగా ఖాళీలులేకుండా రూపొందిస్తుంది.అంతేకాకుండా రి-ఇన్ఫోర్స్మెంట్ స్టీల్ బార్స్ (ఉచలు) పై ప్రకృతి ప్రభావం వల్ల తుప్పు పట్టకుండా కాపాడుతుంది.
బిర్లా A1 స్ట్రాంగ్క్రీట్ ప్రత్యేకమైన ఎల్ పి పి (ల్యామినేటెడ్ పాలి ప్రోపైలిన్) బ్యాగులలో లభిస్తుంది. ఈ సంచులు వెలుపలి చొరబాటును నిరోధిస్తాయి. రవాణా సమయంలోను, పని జరిగే స్థలంలోను సిమెంట్ ను వృధా కాకుండా రక్షిస్తాయి. వీటిలో తేమను నిరోధించే లక్షణం ఉండటం వల్ల సిమెంట్ ఎప్పుడూ పొడిగా, తాజాగా ఉంటుంది.
గమనిక: పని జరిగే చోట ఈ సిమెంట్ సంచులను హుక్స్ తో హ్యాండిల్ చేయవద్దు.