Birla A1 Planning Tool
Video Play

PST గురించి మరింత తెలుసుకోండి

అత్యుత్తమమైనది మాత్రమే అనే వాగ్దానం

భారతదేశపు ప్రముఖ సిమెంట్ కంపెనీలలో ఒకటైన ఓరియంట్ సిమెంటు ద్వారా బిర్లా A1 ప్రీమియం సిమెంట్ తయారు చేయబడుతుంది.

మీ స్వప్నాల సౌధానికి సాటిలేని దృఢత్వం మరియు మన్నికను అందించడానికి, బిర్లా A1 ప్రీమియం సిమెంట్ కఠినమైన నాణ్యత పరీక్షలకు గురి అవుతుంది.

PST ప్రయోజనాన్ని ప ొందండి

బిర్లా A1 ప్రీమియం సిమెంట్ ఏకరీతి కణ పరిమాణం పంపిణీని నిర్ధారించే అత్యాధునిక ప్రెషర్ సస్టైనింగ్ టెక్నాలజీ (PST) తో తయారుచేయబడుతుంది.బిర్లా A1 ప్రీమియం సిమెంట్ నుంచి తయారైన కాంక్రీటు అధిక సంపీడన దృఢత్వాన్ని సాధించి ఎక్కువ ఒత్తిడిని తట్టుకుంటుంది.ఇది మీ స్వప్నాల సౌధాన్ని రక్షిస్తుంది మరియు సుదీర్ఘ జీవితాన్ని నిర్ధారిస్తుంది.

బిర్లా A1ప్రీమియం సిమెంట్ ఉత్పత్తి పోర్ట్ఫోలియో

బిర్లా A1 ప్రీమియం సిమెంట్ పోర్ట్ లాండ్ పోజ్జోలనా సిమెంట్ (PPC) & సాధారణ పోర్ట్లాండ్ సిమెంట్ (OPC) గా అందుబాటులో ఉంది.

  • బిర్లా A1
    స్ట్రాంగ్‌క్రీట్

  • బిర్లా A1
    ఓరియంట్

  • బిర్లా A1 ప్రీమియం సిమెంట్- PPC

  • బిర్లా A1 ప్రీమియం సిమెంట్ - OPC 53 గ్రేడ్

  • బిర్లా A1 ప్రీమియం సిమెంట్- OPC 43 గ్రేడ్

బిర్లా A1 స్ట్రాంగ్‌క్రీట్‌ అనేది ఫౌండేషన్‌, బీమ్‌లు, కాలమ్‌లు మరియు స్లాబ్‌లు లాంటి కాంక్రీట్‌ వినియోగాలకు ప్రత్యేకంగా రూపొందించబడిన సిమెంట్‌. ఇంటి యొక్క బరువు మోసే కాంక్రీట్‌ స్ట్రక్చర్‌లు అత్యంత కీలకమైనవి కాబట్టి, చాలా ఎక్కువ ప్రెషర్‌ తట్టుకునే మరియు కఠినమైన వాతావరణ మార్పులను తట్టుకునేలా ప్రత్యేక సిమెంట్‌ కావాలి. Optimix18 యొక్క పవర్‌తో బిర్లా A1 స్ట్రాంగ్‌క్రీట్‌, మీ ఇంటిని వేగంగా మరియు బలంగా నిర్మించడానికి సహాయపడటమే కాకుండా, ఇది ఎల్లకాలం ఉండేలా కూడా చూస్తుంది.

  • ముఖ్య విశిష్టతలు
    • Optimix18
      బిర్లా A1 స్ట్రాంగ్‌క్రీట్‌ సిమెంట్‌ యొక్క మూడు ప్రధాన లక్షణాలతో సర్వోత్తమం చేయబడింది, దీనిలో మేలిమిదనం, రేణువుల పంపిణీ మరియు దానిలోకి వెళ్ళే యాడ్‌మిక్స్‌ పరిమాణం ఉంటుంది.
    • ఆర్ద్రీకరణ (హైడ్రేషన్) అతితక్కువ వేడి
      హైడ్రేషన్‌ అయినప్పుడు బిర్లా A1 స్ట్రాంగ్‌క్రీట్‌ తక్కువ మొత్తంలో వేడిని విడుదల చేస్తుంది, దళసరి కాంక్రీట్‌ సెక్షన్‌లలో ఉష్ణం పగుళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది.
    • డబల్‌ క్యాల్షియం- సిలికేట్‌- హైడ్రేట్‌ జెల్
      ఇలా ఏర్పడిన జెల్‌ కాంక్రీట్‌ని దట్టంగా మరియు ఖాళీలు లేకుండా చేస్తుంది, అదే సమయంలో ప్రకృతి యొక్క ప్రతికూల ప్రభావాల నుంచి రీబార్‌లను రక్షిస్తుంది, తద్వారా తుప్పును నిరోధిస్తుంది.
  • ముఖ్య ప్రయోజనాలు
    • అత్యధిక దృఢత్వం
      బిర్లా A1 స్ట్రాంగ్‌క్రీట్‌ అధిక దృఢత్వాన్ని కాంక్రీట్‌లో రెగ్యులర్ కాంక్రీట్‌ కంటే ముందుగానే ఇస్తుంది. క్యాస్టింగ్‌ తరువాత మొదటి 28 రోజుల్లో ఇది దాని యొక్క డిజైన్‌డ్ నిర్దిష్ట దృఢత్వాన్ని పొందుతుంది మరియు ఆ తరువాత కూడా దృఢత్వం పొందుతూనే ఉంటుంది.
    • వేగంగా సెట్టింగ్‌ సమయం
      బిర్లా A1 స్ట్రాంగ్‌క్రీట్‌ తన సత్వర సెట్టింగ్‌ సమయంతో కాంక్రీట్‌ యొక్క తదుపరి స్లాబ్లను ముందుగానే పెట్టడానికి సహాయపడుతుంది మరియు పరంజా లేదా ఫారంవర్క్ని సురక్షితంగా మరియు వేగంగా తొలగించడాన్ని సుగమం చేస్తుంది.
    • మన్నిక పెరుగుదల
      ఉష్ణం పగుళ్ళు లాంటి నిర్మాణపరమైన డేమేజ్‌ల నుంచి బిర్లా A1 స్ట్రాంగ్‌క్రీట్‌ రక్షిస్తుంది. ఇది తుప్పు నిరోధకంగా కూడా పనిచేస్తుంది, రీబార్స్‌లను తుప్పు పట్టకుండా రక్షిస్తుంది.

పెరుగుతున్న ఉష్ణోగ్రత మరియు కార్బన్ ఫుట్ప్రింట్తో మన భూమి ఎప్పుడూ లేనంత ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఇలాంటి ఒక పరిస్థితిని అడ్డుకోవడంలో మనలో ప్రతిఒక్కరికీ బాధ్యత ఉందని ఓరియంట్ సిమెంట్లో మేము విశ్వసిస్తాము. భవిష్యత్తు తరాల కోసం సురక్షితమైన మరియు స్థిరమైన పర్యావరణ వ్యవస్థలు నిర్మించడంతో పాటు మా వినియోగదారులకు ఉన్నతమైన మరియు పర్యావరణ అనుకూల ఉత్పత్తులు అందించడమనే మా లక్ష్యానికి అనుగుణంగా, జీవితకాలం మొత్తం పర్యావరణ స్నేహితంగా ఉండే బిర్లాA1ఓరియంట్గ్రీన్ అనే ప్రత్యేక సిమెంట్ అందించడం ద్వారా మేము సగర్వంగా భావిస్తున్నాము.

  • కీలక లక్షణాలు
    • తుప్పు నిరోధకం - ఓరియంట్గ్రీన్తో RCC నిర్మాణాల్లో కేశనాళిక రంధ్రాల సంఖ్య మరియు పరిమాణం తగ్గడం వల్ల కాంక్రీట్ నాణ్యత పెరుగుతుంది. కాంక్రీట్ మిశ్రమంలో ఇది సాంద్రతను పెంచుతుంది. తద్వారా, కాంక్రీట్ నిర్మాణం లోపల ఉక్కు తుప్పు పట్టడానికి కారణమయ్యే మైక్రోస్కోపిక్ పగుళ్ల ద్వారా కాంక్రీటులోకి క్లోరైడ్లు లేదా CO2 చేరడాన్ని అడ్డుకుంటుంది. ఓరియంట్గ్రీన్ అనేది కాంక్రీట్లో అవసరమైన pHని నిర్వహించడం వల్ల, నిర్మాణంలోని ఉక్కు తుప్పు పట్టకుండా ఉంటుంది
    • తక్కువ నీళ్లు చాలు - ఓరియంట్గ్రీన్తో మోర్టార్ మరియు కాంక్రీట్ మిక్స్ కోసం తక్కువ నీళ్లు సరిపోతాయి. ఈ కారణంగా, కాంక్రీటులో తక్కువ సారంధ్రత ప్రయోజనాన్ని ఇది అందిస్తుంది. తద్వారా, నిర్మాణంలో సీపేజీని నివారిస్తుంది. ఫలితంగా, కాంక్రీటు అనేది చిక్కగా మరియు ఏదీ చొరబడని విధంగా ఉంటుంది. ఇతర ప్రధాన బ్రాండ్లతో పోల్చితే ఓరియంట్గ్రీన్ సాధారణ అనుగుణ్యత ఫలితాలనేవి తక్కువ వైపున ఉంటుంది.
    • నీటికి నిరోధకత్వం మరియు ట్యాంపర్ప్రూఫ్ - ట్యాంపర్ప్రూఫ్ మరియు నీటికి నిరోధకత్వం కలిగిన LPP ప్యాకేజింగ్ ద్వారా, ఓరియంట్‌గ్రీన్ సిమెంట్ చిందిపోకుండా మరియు కల్తీ నుండి సురక్షితంగా ఉంటుంది. నిర్వహణ సమయంలో కొక్కీలు ఉపయోగించకపోవడం వల్ల సిమెంట్ తాజాగా ఉంటుంది. ల్యామినేటెడ్ ప్యాకేజింగ్ వల్ల వర్షాకాలంలో ఈ సిమెంట్ మీద తేమ ప్రభావం తక్కువగా ఉండడం వల్ల, వినియోగ జీవితకాలం ఎక్కువగా ఉంటుంది.
    • అద్వితీయమైన దృఢత్వం - ఓరియంట్గ్రీన్ సిమెంట్ అనేది అధిక నాణ్యత గల పోర్ట్ల్యాండ్ సిమెంట్ క్లింకర్లతో పాటు అత్యంత స్వచ్ఛమైన జిప్సమ్ మరియు అధిక రియాక్టివ్ ఖనిజ మిశ్రమాలు ఉపయోగించి, సాంకేతికంగా అత్యున్నతమైన ఉత్పాదక ప్లాంట్లలో ఉత్పత్తి చేయబడుతుంది. అధిక-నాణ్యత కలిగిన మెటీరియల్ అనేది అద్వితీయమైన ప్రారంభ బలం మరియు దీర్ఘకాలిక సంపీడన బలం అందించడంలో సహాయపడుతుంది. ఫలితంగా, నిర్మాణం దృఢంగా మరియు దట్టంగా ఉంటుంది.

బిర్లా A1 ప్రీమియం సిమెంట్ క్లింకర్, జిప్సం మరియు అత్యంత మృదువైన అధిక రియాక్టివ్ ఫ్లై యాష్ కలిపి మిశ్రమం చేయడం ద్వారా తయారు చేయబడుతుంది.దీని అతి గొప్ప ప్రయోజనం ఏకరీతి కణ పరిమాణం పంపిణీ, ఇది ఎక్కువ దృఢత్వాన్ని ఇస్తుంది మరియు దాని నుండి తయారు చేసిన కాంక్రీట్లో తక్కువ సచ్చిద్రతతో అధిక సాంద్రతను సాధించడానికి సహాయపడుతుంది, ఇది పెరిగిన మన్నికకు దారితీస్తుంది. 28 రోజులు క్యూరింగ్ (నీళ్ళు పెట్టిన) తర్వాత ఇది సంపీడన శక్తిగా కనీసం 53 Mpa సాధిస్తుంది.

  • కీలక లక్షణాలు
    • క్లోరైడ్స్ మరియు సల్ఫేట్స్ దాడి వంటి ఉద్రిక్త వాతావరణంలో నిర్మాణాలకు అధిక దృఢత్వం మెరుగ్గా తట్టుకోగలగడాన్ని ప్రసాదిస్తుంది. ప్లస్, బిర్లా A1 తో తయారైన కాంక్రీటు సమయం గడిచేకొద్దీ మరింత దృఢత్వం పొందుతుంది
    • నునుపైన ఫినిష్ మరియు చెమ్మగిల్లడానికి అధిక నిరోధకత
    • హైడ్రేషన్ (చల్లబడటం) యొక్క-వేడి తక్కువ కారణంగా 'పగుళ్లకు' అధిక ప్రతిఘటన
    • సిమెంట్ కనీస వ్యర్థం
    • మంచి ఆర్థిక వ్యవస్థ
  • వేర్వేరు అవసరాలు
    • పారిశ్రామిక, నివాస మరియు వాణిజ్య నిర్మాణాలు
    • మాస్ కాంక్రీటు నిర్మాణ డ్యాములు, కాలువలు, రోడ్లు, డ్రెయిన్లు మొదలైనవి
    • బిల్డింగ్ నిర్మాణం & RCC పని
    • ఉపలేపనం (ప్లాస్టరింగ్) & సిమెంటు సన్న కంకర ద్రవ మిశ్రమంతో ఖాళీలని నింపే మేస్త్రీపని (గ్రౌట్స్) మరియు మోర్టార్స్
    • ప్రవహించే మరియు మురుగునీటి శుద్ధి కర్మాగారం
    • సముద్రపు పని & తీర నిర్మాణము

భారతదేశంలో 53-గ్రేడ్ సిమెంట్ మార్గదర్శకులలో ఒకరు, ఓరియంట్ సిమెంట్ 1992లో ఓరియంట్ గోల్డ్ 53-గ్రేడ్ సిమెంటు ఆవిష్కరించడంతో కట్టడాల నిర్మాణంలో సరికొత్త డైమన్షన్ ని ప్రారంభించింది. ఓరియంట్ గోల్డ్ యొక్క ఏకధాటి విజయం అనేది మేము మా వినియోగదారులకి కేవలం అత్యుత్తమమైనదే అందజేయాలనే మా ప్రయత్నాలకు ఒక రుజువు.బ్రాండ్ ఇప్పుడు మా గొడుగు బ్రాండ్ కింద విలీనం చేయబడింది మరియు బిర్లాA1ప్రీమియం సిమెంట్ - OPC 53 గ్రేడ్ గా పేరు మార్చబడింది.28 రోజులు క్యూరింగ్ (నీళ్ళు పెట్టిన) తర్వాత ఇది సంపీడన శక్తిగా కనీసం 53 Mpa సాధిస్తుంది.

  • కీలక లక్షణాలు
    • అధిక నాణ్యత ముడి పదార్థం మరియు వాంఛనీయ ప్రక్రియ నియంత్రణ ద్వారా సాధించబడే అధిక సంపీడన శక్తి.
    • సంప్రదాయ గ్రేడ్ సిమెంట్ కంటే వేగంగా గట్టిపడుతుంది మరియు నాణ్యమైన నిర్మాణాలను సులభతరం చేస్తుంది.పొదుపైన నిర్మాణాలు, అధిక ప్రాధమిక దృఢత్వం అనేది సిమెంటు వినియోగం మరియు నిర్మాణం సమయం ఆదాచేయడానికి సహాయపడుతుంది.
    • సిమెంటు యొక్క ఏకరీతిగా ఉండటం మరియు మృదువుగా ఉండటం కారణంగా సాటిలేని మన్నిక.

ఓరియంట్ 43 గ్రేడ్ సిమెంట్ అని మొదట పిలువబడిన, ఇది ఓరియంట్ సిమెంట్ యొక్క మొట్టమొదటి విజయాల్లో ఒకటి, తర్వాత మిగతావి అనుసరించడానికి మార్గం వేసింది.అధునాతన ప్లాంట్ యంత్రాంగాలను మోహరించి నియంత్రిత ప్రక్రియ పరిస్థితుల్లో తయారు చేయబడిన ఇది, స్వల్ప కాల వ్యవధిలో ఎంతో ప్రాచుర్యం పొందింది మరియు ఓరియంట్ సిమెంట్ ఇంటింటా వినిపించే పేరుగా రూపొందించడంలో కీలక పాత్ర పోషించింది.8 రోజులు క్యూరింగ్ (నీళ్ళు పెట్టిన) తర్వాత ఇది సంపీడన శక్తిగా కనీసం 43 Mpa సాధిస్తుంది.

  • కీలక లక్షణాలు
    • ముందుగా మూసపోయబడిన, ముందస్తుగా ఒత్తిడి చేయబడిన RCC నిర్మాణాలకి ప్రత్యేకించి జనరల్ పర్పస్ సిమెంట్.
    • ఆస్బెస్టాస్ / ఆస్బెస్టాస్-కాని ఆధారిత ఉత్పత్తుల షీట్లు మరియు గొట్టాలకు అనుకూలమైనది.
    • భవనాలు, వంతెనలు, రోడ్లు వంటి సాధారణ సివిల్ ఇంజనీరింగ్ నిర్మాణం కోసం తగినది.
    • BIS ప్రమాణాల కంటే సంపీడన బలాలు ఎక్కువగా ఉంటాయి.