
మీ స్వప్నాల సౌధం తరాల తరబడి నిలచి ఉండాలి
ఉత్తమ నాణ్యత సిమెంట్ ను ఉపయోగించండి.
సిమెంట్ అనేది అత్యవసర ముడి పదార్థం మరియు నిర్మాణ ఖర్చులో దాదాపు 15% వరకు ఉంటుంది.ఇది మీ పునాది, గోడలు మరియు పైకప్పులను నిర్మించే ఇసుక మరియు రాతి కంకరకి ఒక జోడించే (బైండర్) కీలక పాత్రని పోషిస్తుంది.కాబట్టి, సిమెంట్ యొక్క రకం మరియు బ్రాండ్ ని తెలివిగా ఎంచుకోండి. ఉపయోగించిన సిమెంట్ యొక్క నాణ్యత ఎంత మంచిగా ఉంటే, మన్నిక అంత మెరుగ్గా మరియు మీ ‘స్వప్నాల సౌధం’ యొక్క జీవిత కాలం అంత సుదీర్ఘంగా ఉంటుంది.
ఈ విభాగంలో, మీ గృహ నిర్మాణాన్ని ప్రారంభించేటప్పుడు మీరు మరింత అవగాహనాపూర్వక ఎంపికలను చేయటానికి వీలుగా మీకు సిమెంట్ గురించి ఉండగల కొన్ని ప్రాథమిక ప్రశ్నలకు మేము సమాధానం ఇస్తాము.మీకు ఆసక్తికరంగా ఉండగల, గృహ నిర్మాణం యొక్క విభిన్న ఇతర విషయాలపై కూడా మా దగ్గర అనేక వ్యాసాలు ఉన్నాయి.
-
గృహ నిర్మాణానికి ఏ రకమైన సిమెంట్ ఉపయోగించాలి?
నిర్మాణం కోసం సర్వసాధారణంగా ఉపయోగించే రెండు సిమెంట్లు ఏమిటంటే ఆర్డినరీ పోర్ట్ లాండ్ సిమెంట్ (OPC) మరియు పోర్ట్ ల్యాండ్ పోజోలనా సిమెంట్ (PPC).
అయితే గృహ నిర్మాణానికి మరియు ముఖ్యంగా పునాదులు, స్తంభాలు మరియు బీములు మరియు స్లాబుల వంటి కీలక పనుల కోసం PPC సిమెంట్ మరింత అనుకూలంగా ఉంటుంది.
-
బిర్లా A1 ప్రీమియం సిమెంట్ నా గృహ నిర్మాణ అవసరాలకు ఎందుకు ఉత్తమమైనది?
కాంక్రీటు అనేది రసాయనాలు మరియు నీరు నుండి దాడికి గురవుతుంది.నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగించే ఉక్కు కడ్డీలకు క్లోరైడ్లు తుప్పు పట్టించగలవు, సల్ఫేట్లు కాంక్రీటుపైనే దాడి చేస్తాయి, చివరికి ఇది తుప్పు పట్టడం, పగుళ్లు మరియు లీకేజీలుగా పరిణమిస్తుంది.అయితే బిర్లా A1 ప్రీమియం సిమెంట్ ఒక రక్షణ జెల్ గా ఏర్పడే ఖచ్ఛితంగా ప్రాసెస్ చేయబడిన ఫ్లై యాష్ మరియు రియాక్టివ్ సిలికా తో బలోపేతం చేయబడినది.బిర్లా A1 ప్రీమియం సిమెంట్ నుండి తయారైన కాంక్రీట్ అందువలన తుప్పు మరియు గంధకితము (సల్ఫేట్) నిరోధకతను కలిగి ఉంటుంది.
-
ఉపయోగించే సిమెంటు యొక్క నాణ్యతను నేను ఎలా నిర్ధారించగలను?
మీరు క్రింది ఫీల్డ్ పరీక్షలను చేయడం ద్వారా సిమెంట్ నాణ్యతను నిర్ధారించవచ్చు:
- బస్తా తెరిచి, సిమెంట్ ని బాగా పరిశీలించండి. కనిపించే గడ్డలు ఏవీ ఉండకూడదు.
- సిమెంటు రంగు సాధారణంగా పచ్చని బూడిద రంగులో ఉండాలి.
- సిమెంట్ బస్తాలోకి మీ చేతిని గుచ్చండి. ఇది తాకితే చల్లని అనుభూతి ఉండాలి. లోపల ఏ గడ్డలూ ఉండకూడదు.
- చిటికెడు సిమెంట్ తీసుకుని వేళ్ల మధ్య ఎలా అనిపిస్తోందో చూడండి. ఇది మీరు ముట్టుకోవటానికి మృధువుగా ఉండాలిగాని బరకగా కాదు.
నిర్మాణం యొక్క వివిధ భాగాలు మరియు దశలు ఏమిటి?- తవ్వకం
- పునాది
- నిలువు స్తంభాలు, బీములు మరియు స్లాబులు
- ఇటుక పని
- ప్లాస్టరింగ్
- ఫినిషింగ్