
సకాలంలో మరమ్మతులు
అవి తరాల తరబడి నిలచి ఉండేలాగా చేస్తాయి
మీ స్వంత మధుర గృహంలో జీవించే ఆనందాన్ని పోలినది మరొకటి ఉండదు.మీరు దానిని నిర్మించడానికి పడ్డ శ్రమకి అది ఎంతో గిట్టుబాటు.కొన్ని ముందస్తు చర్యల సహాయంతో, మీ గృహం ఈ రోజు ఉన్నంత కొత్తగా, అందంగా నిలచి ఉండేలాగా మీరు నిర్ధారించుకోవచ్చు.ప్రధాన మరమ్మత్తుల కంటే నివారణాత్మక నిర్వహణ ఖర్చు తక్కువ.
మీ కుటుంబం మరియు సంపదలు పెరగడంతో మీరు అదనపు గదులు లేదా అంతస్తులను కూడా నిర్మించాలనుకోవచ్చు.
ఈ విభాగంలో మేము నివారణాత్మక నిర్వహణపై మరియు మీ ఇప్పటికే ఉన్న మీ ఇంటికి జోడించాలని మీరు గనక ప్రణాళిక చేసుకుంటే ఏ చర్యలు తీసుకోవాలి అనేదానిపై కొన్ని సులభ చిట్కాలను అందిస్తాము
-
నేను పగుళ్లు మరియు కారడాలను ఎలా పరిష్కరించగలను?
నిర్మాణం సమయంలో సరైన కాలవ్యవధి కోసం సరైన క్యూరింగ్ (నీళ్ళు పెట్టడం) అనేది పగుళ్లు ఏర్పడటాన్ని తగ్గించడానికి ఒక మార్గం.అయితే కాలం గడిచిన కొద్దీ పగుళ్లు మరియు కారడాలు సంభవిస్తాయి. చిన్నపాటి వాటిని రంగులు మరియు మెరుగులతో సర్దిపుచ్చవచ్చు.మిగతావాటికి జరిగిన నష్టాన్ని బట్టి, నాగవాసం (స్టెప్లింగ్), గాలి పీడనంతో పొడి సిమెంట్, ఇసుకతో కాంక్రీటు పని మరమ్మతు (గునిటింగ్) లేదా ఒకనేల లేదా రాళ్ళ నిర్మాణంలోకి సిమెంట్, ఇసుకల ద్రవ మిశ్రమంతో ఖాళీలను నింపడం (గ్రౌటింగ్) వంటి నైపుణ్యమైన మేస్త్రీ పని అవసరమవుతుంది.అటువంటి పనిని చేపట్టే ముందు నిపుణుడిని సంప్రదించడం సిఫార్సు చేయబడుతోంది.
-
గోడలు మరియు పైకప్పులకు మళ్ళీ సిమెంట్ చేయడానికి ఏ సిమెంట్ ఉత్తమం?
దాని అధిక సంపీడన దృఢత్వం కారణంగా గోడలు మరియు పైకప్పును తిరిగి సిమెంటు చేయడం కోసం PPC అత్యంత అనుకూలంగా ఉంటుంది.